మన్యం న్యూస్ మంగపేట, ఫిబ్రవరి 25… మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ కమిటీ ఎన్నిక శనివారం హన్మకొండ సర్కిల్ గెస్ట్ హౌస్ లో ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్ అధ్యక్షతన జరిగింది. చైర్మన్ గా నూతిలకంటి ముకుందం కు నియమక పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు. మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణ, కొత్తగూడా మండల పార్టీ అధ్యక్షులు వేణు, మండల నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య, మల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు సోయం ఈశ్వర్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
