శ్రీశ్రీశ్రీ రామచంద్ర హనుమత్ లక్ష్మణ సాహిత స్వామి వార్ల ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ,ఎమ్మెల్యే మెచ్చా
మన్యం న్యూస్ అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి 25: అన్నపురెడ్డిపల్లి మండలంలోని అబ్బుగూడెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ రామచంద్ర హనుమత్ లక్ష్మణ సాహిత స్వామి వార్ల ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి శనివారం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు లను ఆలయ కమిటీ సభ్యులు,అర్చకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం యోగశాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి భారత్ లావణ్య, బిఆర్ఎస్ నాయకులు బోయినపల్లి సుధాకర్ రావు,వేముల హరీష్, చల్లా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.