UPDATES  

 బాగా చదువుకోవాలి భవిష్యత్తును చక్కదిద్దుకోవాలి విద్యార్థులతో ముచ్చడించి మంత్రి పువ్వాడ పాఠశాలను సందర్శించిన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే మెచ్చా

బాగా చదువుకోవాలి భవిష్యత్తును చక్కదిద్దుకోవాలి
విద్యార్థులతో ముచ్చడించి మంత్రి పువ్వాడ పాఠశాలను సందర్శించిన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే మెచ్చా*

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 25.. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అవరోధించి కన్న తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని విద్యార్థులను మంత్రి పువ్వాడ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. శనివారం అశ్వరావుపేట మండలంలో అచ్చుతాపురం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు శనివారం మన ఊరు మనబడి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ ఎంఎల్ఏ మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించిందని, పాఠశాలల పునరుద్దీకరణకు పాటుపడుతుందని పిల్లలకు మధ్యాహ్న భోజనం మరియు పుస్తకాలు, యూనిఫామ్ ఉచితంగా అందజేస్తుంది అన్నారు. కార్పొరేట్ యొక్క పాఠశాలల యొక్క దీటిలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయన్నారు. పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అలాగే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుధీప్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేంద్ర, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, అచ్చుతాపురం గ్రామ సర్పంచ్ యాట్ల నాగలక్ష్మి, ఇనుగంటి హరిబాబు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !