మన్యం న్యూస్.ములకలపల్లి. ఫిబ్రవరి 25..మండల కేంద్రంలో ని రాజుపేట అంగన్వాడీ కేంద్రాల్లో సూపర్ వైజర్ సామ్రాజ్యం ఆధ్వర్యంలో శనివారం వేడుకలు జరిగాయి. అంగన్వాడీ సెంటర్ల పరిధిలో ఉన్న గర్భిణీ లను గుర్తించి వారికి సీమంతం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ లు, బాలింతలు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం ప్రతి రోజు తీసుకోవాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం లో జీరో నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్, పౌష్టికాహారం అందజేస్తున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
