మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 25
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే తల్లిదండ్రులు ముఖ్య పాత్రని దుమ్ముగూడెం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు అపక శంకర్ అన్నారు. శనివారం దుమ్ముగూడెం పాఠశాలలో వారి అధ్యక్షతన పదవ తరగతి విద్యార్థులు తల్లిదండ్రుల ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు సమయం దగ్గర పడుతుందన్న పిల్లలు పరీక్షలకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు ఇంటిదగ్గర ప్రత్యేక కార్యచరణ చూపాలని కోరారు వారి క్రమశిక్షణ భవిష్యత్తులో రాబోవు పరీక్షలకు ఏ విధంగా సిద్ధం కావాలి ఇంగ్లీష్ మాథ్స్ సబ్జెక్టులో పరిజ్ఞానం వారికి సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి సభ్యులు షేక్ హుస్సేన్ అహ్మద్, శ్రీవిద్య, సరిత, కుమారి, ఉపాధ్యాయులు లక్ష్మణ్, బాలాజీ, రామకృష్ణ, రజిని, సునీత, సరోజినీ పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.