UPDATES  

 సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా ఐ ఎఫ్ టి యూ అధ్వర్యంలో ఎస్ ఓ టు జిఎం లలిత్ కుమార్ కు వినతి పత్రం

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్, ఫిబ్రవరి 25
మణుగూరు ఏరియా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్ టియూ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు శనివారం మణుగూరు జిఎం కార్యాలయం ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతపత్రాన్ని ఏరియా ఎస్ ఓ టు జిఎం డి.లలిత్ కుమార్ కు అందజేశారు.ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్డి.నాసర్ పాషా మాట్లాడుతూ,సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా వివిధ గనులు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 2020 -21 సంవత్సరానికి సంబంధించి సివిల్, పర్చేజ్, పార్కులు,గెస్ట్ హౌస్ లు,ఇంకా కొంతమంది కాంటాక్ట్ కార్మికులకు సీఎంపిఎఫ్ పాసు బుక్కుల వివరాలు అందజేయాల్సి ఉందని,అదే విధంగా జమ వివరాలతో కూడిన 2021- 22 వార్షిక పిఎఫ్ పాసు బుక్కులు కూడా అందజేయాలని కోరారు.అలాగే అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు 2021- 22 వార్షిక సీఎం పీఎఫ్,పేస్లిప్స్ కూడా అందజేయాలి అని అన్నారు. చనిపోయిన వారు, అనారోగ్యంతో పని మానివేసిన కాంటాక్ట్ కార్మికులకు సంబంధించిన పిఎఫ్ వాపస్ సొమ్ము త్వరగా అందజేయాలి కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్ ఏరియా జీవో నెంబర్ 22 ను గెజిట్ చేసి అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.దీనికై సింగరేణి యాజమాన్యం చొరవ చూపాలి అని సెంట్రల్ జీవో పెరిగిన వేతనాలకు సంబంధించి ఏరియా హాస్పిటల్,సివిల్,ఓసి-4 సివిక్ పెండింగ్,వేతనాలు వెంటనే చెల్లించాలి అన్నారు.కాంటాక్ట్ కార్మికులకు ప్రతి నెల ఏడవ తేదీలోగా జీతాలు చెల్లించేలా చూడాలి అని,అన్ని విభాగాల కాంటాక్ట్ కార్మికులకు పేస్లిప్స్ ఇవ్వాలని కోరారు.ఓసి 2 సిల్ట్ కాంటాక్ట్ కార్మికులకు పిఎఫ్ అమలు చేయాలి అని,ప్రైవేటు కన్వీనేన్స్ వాహన డ్రైవర్లకు సెంట్రల్ జిఓ ప్రకారం పెరిగిన వేతనాలను చెల్లించాలి అన్నారు.ఏరియాలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్ లను ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ లకు, ప్రైవేట్ వాహన డ్రైవర్లకు, కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలి అని కోరారు. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఎస్ ఓ టు జిఎం డి.లలిత్ కుమార్ ను కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆంగోత్. మంగీలాల్,కె యాదగిరి, కే.గురుమూర్తి,వి శంకర్,గోపి, సిహెచ్.కాంతారావు,ఎన్ రాజేష్,దేవేందర్,జి శ్రీనివాస్, రాజేష్,ఏం రమేష్,సత్యం, ఉపేందర్,అన్నపూర్ణ,కొమరమ్మ,లక్ష్మి,నాగమ్మ,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !