తుపాకి తూటాల శబ్దాలతో దద్దరిల్లిన అడవి మావోయిస్టు – పోలీసులు మధ్య
ఎదురు కాల్పులు..
ముగ్గురు డిఆర్జి పోలీసులు మృతి..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 25
చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించారు. మరికొందరికి గాయాలు అయినట్టు తెలుస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా రిజర్వ్ గార్డ్ ( డి ఆర్ జి ) బృందం ఈ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో భాగంగా సాధారణ పెట్రోలింగ్ కోసం ఉదయం జాగర్గుండ నుంచి కవాతు చేసింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో కుందేడ్ గ్రామ సమీపంలో మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో దళం చిక్కుకుంది. అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.భద్రతా సిబ్బంది తిరుగుబాటుదారులకు తగిన సమాధానం ఇచ్చారు. ఈ సంఘటనలో ఓ అధికారి సహా ముగ్గురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు.వారిని ఏఎస్సై రామురామ్ నాగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా, సైనిక్ వంజం భీమాగా గుర్తించారు.సమాచారం అందుకున్న వెంటనే దంతేవాడ, సుక్మా నుంచి బలగాలను పంపించారు. భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.