మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 25..
ప్రయాణికుల సౌకర్యం కోసం గతంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరణ చేస్తున్నట్టు భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ రామారావు శనివారం ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాలను కలుపుకుంటూ భద్రాచలం నుంచి వయా ఆర్లగూడెం లక్ష్మీ నగరం బస్సు సర్వీసును ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ బస్సు సర్వీసు ఉదయం 8.30గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి తునికి చెరువు రామచంద్రన్ పేట చెరుపల్లి మారాయి గూడెం ఆర్లగూడెం మీదుగా లక్ష్మీ నగరం 10 గంటలకు చేరుకుంటుందని మరల అదే బస్సు తిరిగి భద్రాచలం వస్తుందని అన్నారు. సాయంత్రం ఐదు గంటలకి బయలుదేరి 6.15కు లక్ష్మీనగరం చేరుకుంటుందని, మరల తిరిగి సాయంత్రం 7.45 భద్రాచలం చేరుకుంటుందని రోజుకి రెండు బస్సు సర్వీసులు ఉంటాయని ప్రయాణికులు గమనించి ఆర్టీసీ ప్రయాణం చేసి అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.