మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి 25:- కొమరారం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని,ఇల్లందు ను రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలని గత 25 రోజులుగా కోమరారంలో న్యూడెమోక్రసీ అధ్వర్యంలో రిలేనిరహార దీక్ష కొనసాగుతున్న విషయం పాఠకులకు తెలిసిందే,శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేత దళ్ సింగ్ నాయక్ మాట్లాడుతూ 25రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.ఎమ్మెల్యే హరిప్రియ రిలే నిరాహారదీక్షలో పాల్గొనడం మినహా ఆమెతో మండల డిమాండ్ కు ఎటువంటి ప్రయోజనం కలుగలేదని ఎద్దేవా చేసారు.ప్రభుత్వం స్పందించి వెంటనే కోమరారాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో శంకర్,ప్రసాద్, బిచ్యా,సావిత్రి,సామ్రాట్,హరికృష్ణ,పులి సైదులు ఎంఎల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.