.
మన్యం న్యూస్ మణుగూరు టౌన్, ఫిబ్రవరి 25
పినపాక నియోజకవర్గ మాదిగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మాదిగల మనుగడ కొరకు రాజకీయ,సంఘాల పరంగా సమాజంలో ఉన్న మాదిగలు కలిసికట్టుగా నియోజకవర్గంలో తమ ఉనికిని చాటే విధంగా, శనివారం నాడు ఐక్యవేదిక మణుగూరు మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా గంగారపు రమేష్,కార్యదర్శి బోయిళ్ళ రాజు,ఉపాధ్యక్షులు పొడుతూరి రాములు,చుక్కా శంకర్,సహాయ కార్యదర్శి తేగటి చిరంజీవి,సహాయ కార్యదర్శి పొడుతూరి రాము, కోశాధికారి పడిదల సురేష్, ప్రచార కార్యదర్శి వరికిల్ల కృష్ణ, కమిటీ సభ్యులుగా కన్నెగంటి వేణు,రావులపల్లి వెంకట్, బోయిళ్ళ సత్యం,సూదిపోగు లక్ష్మణ్ రావు,రామనర్సయ్య, కొప్పుల మల్లేష్,పడిదల సతీష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మణుగూరు మండల నూతన అధ్యక్షులుగా ఎన్నికైన గంగారపు రమేష్ మాట్లాడుతూ,తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలను తనకు అప్పగించినందుకు పినపాక నియోజకవర్గం ఐక్యవేదిక అధ్యక్షులు రావులపల్లి రామ్మూర్తి కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ,తన బాధ్యతలను నిర్వర్తించి మాదిగల మనుగడ కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.