వాడి వేడిగా సర్వసభ్య సమావేశం.
ప్రగతి నివేదికను సమర్పించిన అధికారులు..
గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి.. ఎంపీపీ రేగా కాళిక.
గ్రామపంచాయతి లో పైసలు లేవు పనులు చెయ్యలెం సర్పంచులు.
మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 25.. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రేగా కాళికా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షత వహించిన ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ. గ్రామాల అభివృద్ధిలో అధికారులు ప్రతినిధులు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి అధికారి ప్రతిరోజు గ్రామపంచాయతీలో పర్యటన చేసి సమస్యలు తెలుసుకోవాలని ఆమె ఆదేశించారు. అనంతరం అధికారులు తమ ప్రగతి నివేదికను సమర్పిస్తుండగా ఒక్కొక్క శాఖ నుంచి అధికారులు తమ నివేదికను అందజేశారు. మిషన్ భగీరథ అధికారులు తమ నివేదికను సమర్పిస్తూ ఉండగా సర్పంచుల నుంచి పలు ప్రశ్నలు ఎదురై చర్చ ఒక్కసారి గా వేడెక్కింది. తమ గ్రామాలలో నీరు రావడంలేదని అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడంలేదని సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు. కలగజేసుకున్న ఎంపీడీవో ఎంపీపీ సర్పంచులను సమదాయించి అధికారులను హెచ్చరించారు. సమస్యను త్వరితగతిన పూర్తిచేసి వేసవికాలం కావడంతో తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బట్టుపల్లి సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు మాట్లాడుతూ. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలని ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలు చేసి అప్పుల పాలయ్యామని వారన్నారు. పల్లె ప్రకృతి వనాలు క్రీడా ప్రాంగణాలు పూర్తి చేసినప్పటికీ సంబంధించిన బిల్లు ఇప్పటివరకు మంజూరు కాలేదని తన ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు ఆత్మహత్యల శరణ్యమని అన్నారు. తర్వాత కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథం మాట్లాడుతూ సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా చెక్కులు మారుస్తున్నారని కనీసం సమాచారం అందించడం లేదని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. పంచాయతీ సర్పంచులు ఫోన్ చేస్తే కార్యదర్శులు కనీసం స్పందించడం లేదని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.సమత్ బట్టుపల్లి సర్పంచ్ పోలబోయిన .శ్రీవాణి మాట్లాడుతూ. మండల పరిషత్ కార్యాలయానికి వస్తే సర్పంచులకు కనీస ఎంపీడీవో, ఎంపీవో, లేరు అనే సమాధానం కూడా ఎవరు చెప్పడం లేదని ఆమె సభ దృష్టికి తీసుకువచ్చారు. తమకు రావాల్సిన బకాయిలు త్వరగా వచ్చే విధంగా చూడాలని లేనిపక్షంలో దీక్ష చేస్తామని ఆమె తెలిపారు. అనంతరం విద్యాశాఖ మీద సమీక్ష ప్రారంభించడంతో విద్యాశాఖ అధికారి వీరస్వామి తమ ప్రగతి నివేదికను సభ ముందు ఉంచారు. దీనితో పోలబోయిన శ్రీవాణి ,ఎంపీపీ రేగా కాళిక, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, వారికి వచ్చినప్పుడు మూడు గంటలకు వెళ్ళిపోతున్నారని మీ పర్యవేక్షణ లోపం వలన వారికి భయం అనేది లేకుండా పోయిందని వారు తెలిపారు. ఎంఈఓ వీరస్వామి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు స్కూలుకు వచ్చి వ్యాప్ లో ఫోటో పెట్టాలని అలా ప్రతిరోజు ఉపాధ్యాయులు పెడుతున్నారని లేటుగా వచ్చే వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు మాట్లాడుతూ. విద్యాశాఖ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయని ప్రతిరోజు స్కూలుకు ఉపాధ్యాయులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గ్రామాలలో పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పాఠశాలలను సర్పంచులు ఎంపీటీసీలు సందర్శించి సూచనలు చేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధిలో అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు సమన్వయం చేస్తూ ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని ఆమె ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీడీవో, జెడ్పిటిసి,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
