మన్యం న్యూస్ మణుగూరు టౌన్, ఫిబ్రవరి 25.. మణుగూరు మండల సిపిఎం నాయకులు పిట్టల కృష్ణ అనారోగ్యంతో శనివారం మరణించారు. విషయం తెలుసుకొన్న మణుగూరు జెడ్పీటీసీ పోశం.నర్సింహారావు,ఎంపీపీ కారం విజయ కుమారి వారి ఇంటికి వెళ్ళి వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు రామసహాయం,వెంకట్ రెడ్డి, వార్డు మెంబర్లు వీరపనేని చెన్నకేశవులు,బీరమ్మ,మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గాండ్ల సురేష్,కర్ల వెంకన్న, యగ్గడి నరసింహారావు, ఖమ్మంపాటి శ్రీనివాస్,సుతారి నాగభూషణం,కోటయ్య తదితరులు ఉన్నారు
