మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 25 మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఆయం నరసింహారావు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు పాయం. రాజబాబు రేగా విష్ణు చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ట్రస్ట్ ద్వారా శనివారం పాయం నరసింహారావు దశదినకర్మలకు పదివేల రూపాయలు మృతుడు కుటుంబానికి మండల అధ్యక్షులు రావుల సోమయ్య సీనియర్ నాయకులు రేగా సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సారయ్య నిట్టా.ప్రభాకర్, గొగ్గలి. బాటయ్య,కటకం.నరసింహులు,కొమరం.రవిందర్ పాల్గొన్నారు.
