మన్యం న్యూస్, నూగుర్ వెంకటాపురం, ఫిబ్రవరి 25
వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామంలొ ములుగు జిల్లా కన్వీనర్ గా బట్ట మురళీకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ బీసీకులాలను అణచివేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతరించిపోతున్న కుల, చేతి వృత్తుల వారికి బీసీ సబ్ ప్లాన్ ప్రవేశ పెట్టకపోతే జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని.
ఆయన తెలిపారు.చేతివృత్తులను సమస్త కుల వృత్తుల మనుగడను పాలక ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా కన్వీనర్ బట్ట మురళీకృష్ణ అన్నారు.
బీసీ కులాల జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్స్ ఇవ్వాలి అని ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల బీసీ కులాలకు అన్యాయం జరుగుతుందని, వారికి అన్ని విధాలుగా న్యాయం జరగని పక్షంలో పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంకటాపురం మండలం నుండి బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ మురళీకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నిక అయినందుకు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
