UPDATES  

 డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ పై స్కావెంజర్ దాడ కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో ఘటన స్కావెంజర్ ను అరెస్టు

డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ పై స్కావెంజర్ దాడ కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో ఘటన స్కావెంజర్ ను అరెస్టు చేయాలని స్టాఫ్ నర్సులు ఆందోళన స్కావెంజర్ను అదుపులోకి తీసుకున్న వన్ టౌన్ పోలీసులు మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26.. విచక్షణ జ్ఞానాన్ని మరిచి డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ పై స్కావెంజర్ దాడి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో ఆదివారం చోటుచేసుకుంది. స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్న వరున్యకు అక్కడే పని చేస్తున్న స్కావెంజర్ రాంబాబుకుమధ్య కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో వాడి పారేసిన సిరంజిలు తీసేసి శుభ్రం చేయాలని స్కావెంజర్ రాంబాబును స్టాఫ్ నర్స్ చెప్పడంతో కొంత సమయం కావాలని తన ఇష్టం వచ్చినప్పుడే చేస్తానని మీరు ఎవరు చెప్పనవసరం లేదంటూ రాంబాబు స్టాఫ్ నర్స్ పై దురుసుగా ప్రవర్తించాడు. అంతేగాకుండా అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ ల పై కూడా అతను కోపగించుకుంటూ నేనింతే ఎవరి మాట వినను నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను ఎవరికైనా చెప్పుకోండి నాకేం భయం లేదు అంటూ దురుసుగా ప్రవర్తించాడు. అయితే అక్కడున్న స్టాఫ్ నర్స్ లందరూ కొంత విస్మయానికి గురయ్యారు. డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ ను ఎందుకు తిడుతున్నావని స్కావెంజర్ రాంబాబును హెచ్చరించినప్పటికీ అక్కడ నుంచి వెళ్లకపోగా అక్కడున్న వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలను చూడకుండా మీది మీదికి వచ్చాడు. దీంతో స్టాఫ్ నర్స్ వరున్య అడ్డగించి ఏం కొడతావా అని సమాధానం చెప్పడంతో అక్కడ స్టాఫ్ నర్స్ అందరు చూస్తుండగానే రాంబాబు ఆ స్టాఫ్ నర్స్ పై చేయి చేసుకున్నాడు. దీంతో నిర్గాంత పోయిన స్టాఫ్ నర్స్ లందరూ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సీఎంఓ రాంబాబు ని పిలిచి విచారణ చేపట్టారు. జరిగిన విషయాన్ని తెలుసుకుని రాంబాబు పై సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ పై ఎందుకు చేయి చేసుకున్నావని మందలించారు. అంతేకాకుండా కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడంతో వన్ టౌన్ పోలీసులు స్కావెంజర్ రాంబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !