మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం మండలంలో పర్యటించబోతున్నారని ఆ పర్యటనను విజయవంతం చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ కోరారు. నూతనంగా మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పూర్తయిన పనులను ప్రారంభిస్తారని అన్నారు. ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు
