మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 26 మండల పరిధిలోని అమరారం పంచాయతీలో గల కొత్తూరు గ్రామంలో ఆదివారం బొడ్రాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రూ.50వేల రూపాయలు విరాళంగా ఇవ్వగా, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సొసైటీ డైరెక్టర్ కామేశ్వరరావు చేతుల మీదుగా గ్రామ అధ్యక్షుడు బిజ్జ రమేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా కొత్తూరు గ్రామ మహిళలు బిజ్జ రాంబాయి, జబ్బ జయ, ఇతరులు నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివాసీల కోసం అవసరమైన సహాయాన్ని అందిస్తున్న ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, కొత్తూరు గ్రామ ప్రజలైన బిజ్జ నవీన్, బిజ్జ నాగరాజు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎడ్ల కుమారస్వామి, బొడ్రాయి ప్రతిష్ట అర్చకులు వీరస్వామి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
