పల్లే మురిసే… రహదారులు మెరిసే పినపాక ఎమ్మెల్యే రేగా ప్రత్యేక కృషితో పల్లెలకు మంచి రోజులు వచ్చాయి నాడు హామీ ఇచ్చే నేడు నిధులు సాధించి తెచ్చే ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడనుంది మండలాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా ప్రభుత్వ విప్ రేగా మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 26: మండలంలోని పల్లెలకు మంచి రోజులు వచ్చాయి. ఏండ్ల నాటి నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలో హామీ ఇచ్చిన ప్రకారం మండలంలోని ప్రతి పల్లెకు రహదారులకు నిధులను సాధించి తీసుకువచ్చారు. మండలంలోని ప్రతి పల్లెకు వెళ్లాలంటే గతంలో నరక పాయమై ఉండేది . ఇప్పుడు ప్రతి పల్లెకు రహదారి మంజూరు కావడంతో గిరిజన ప్రజల ముఖాల్లో సంతోషం కనబడుతుంది. గతంలో ఏ నాయకుడు మంజూరు చేయని విధంగా రహదారులకు నిధులను మంజూరు చేసి వాటిని పూర్తిచేసే విధంగా ఎంతో దృఢ సంకల్పంతో పనిచేస్తున్న రేగాకు మండల ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసల జల్లు కురుస్తుంది. పెద్దతోగు వెళ్లాలంటేనే నరకయాతనగా ఉండే రహదారికి నిధులను మంజూరు చేసి త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. ముత్తాపురం నుంచి దొంగతోగు రహదారిని మంజూరు చేసి కిన్నెరసాని వాగుపై వంతెన పనులను ఆయన శంకుస్థాపన చేయనున్నారు. చిన్న వెంకటాపురం మల్లెల గుంపు వెళ్లాలంటే మధ్యలో కిన్నెరసాని వాగు దాటాల్సి ఉంటుంది వర్షాకాలంలో ఆ గ్రామ ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే నరకపాయమే అలాంటివి ప్రభుత్వ విప్ రేగా వంతెన తోపాటు రహదారిని సైతం మంజూరు చేసి గ్రామస్తుల గుండెల్లో చిరస్మనీయమైన ముద్రవేశారు. అనేక రహదారులను పూర్తి చేసి గిరిజన పల్లెల కష్టాలను తొలగించిన ఆదర్శప్రాయుడయ్యారు. ప్రారంభమైన పనులన్నీ పూర్తి అయితే రానున్న రోజులలో రహదారి కష్టాలు పూర్తిగా. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ క్షణాన కూలుతుందో అన్న భయంతో సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. అ క్రమంలో గుండాల పర్యటనకు ప్రభుత్వ విప్ రేగా వచ్చినప్పుడు తహాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి నూతన కార్యాలయాన్ని మంజూరు చేశారు. మంగళవారం ఈ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనుండడంతో అధికార యంత్రాంగం పనులలో నిమగ్నమైంది. రానున్నరోజుల్లో మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు.
