మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి26: అక్రమ మట్టి తవ్వకాలపై టాస్క్ పోర్స్ పోలీసులు దాడి చేసిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. టాస్క్ పోర్స్ సిసిఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… అయ్యన్నపాలెం గ్రామ శివారులో మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం మేరకు టాస్క్ పోర్స్ పోలీసులు దాడులు చేయగా, మట్టి తవ్వకం చేపడుతున్న రెండు జేసీబీలు, 9 ట్రాక్టర్లను సీజ్ చేసి, స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా టాస్క్ పోర్స్ ఎస్సై మాట్లాడుతూ… గ్రామాల్లో అక్రమ తవ్వకాలు జరిపితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. దాడుల్లో పట్టుబడ్డ వాహనాలపై కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపాడు. ఈ దాడుల్లో టాస్క్ పోర్స్ సిబ్బంది. స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
