మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 26 మండలంలోని సింగిరెడ్డి పంచాయతీలో గల దేవనగరం గ్రామంలో వెలసి ఉన్న సమ్మక్క, సారమ్మ, బద్ది పోచమ్మ దేవాలయంలో ఆదివాసి చిత్రకారులకు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ ఐక్యవేదిక కన్వీనర్ సోలం అశోక్ అధ్యక్షత వహించగా ఆదివాసీ చిత్రకారులైన కొమరం కోటి, సోలం రమణ, పాయం సోమయ్య లను ఎంపీటీసీ కాయం శేఖర్, ఆలయ దేవర బాల తోలెం నాగయ్య, ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుడు శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కాయం శేఖర్ మాట్లాడుతూ, ఆదివాసీ దేవతలైన సమ్మక్క, సారలమ్మ చిత్రాలను అందంగా చిత్రీకరించడం ఆనందదాయకమని అన్నారు. ఆదివాసీ చిత్రకారులను ఆదరించడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు ఇర్ఫా రామనాథం, ప్రజా గాయకుడు సిద్దెల హుస్సేన్, పర్సిక రామారావు, చింత ముత్తయ్య, రాంబాబు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
