మన్యం న్యూస్ దుమ్ముగూడెం, ఫిబ్రవరి 26 గ్రామీణ ప్రాంతంలోని యువత అన్ని రంగాల్లో రాణించి ముందుకు సాగాలని దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ కోరారు. మండలంలోని చిన్నలబెల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు వల్ల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఈ క్రీడల్లో ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంత వాతావరణంలో స్నేహబంధం ని పెంపొందించుకోవడానికి నిర్వహించుకోవాలని సూచించారు అనంతరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యాలు మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా నిర్వహించడం అభినందనీయమని యువత క్రీడలతో పాటు భవిష్యత్తు బంగారు బాటలు పునాది వేసుకోవాలని తెలిపారు .ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నోటిఫికేషన్ యువత సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉద్యోగులు సాధించాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పిటిసి తెల్లం సీతమ్మ, పార్టీ ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు ,ఎంపిటిసి సీత, తెల్లం భీమరాజు, నిర్వాహ కమిటీ సభ్యులు శ్యామల చంటి, తునికి జయరావు, సాయిబాబు, పూసం రమేష్, కాక రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
