బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి… రూ.220 కోట్లతో పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు మన్యం న్యూస్, కరకగూడెం, ఫిబ్రవరి 26.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లోని సమత్ భట్టుపల్లి గ్రామం నందు బూర్థారం శ్రీ సువర్ణగిరి జ్వాలా లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదివారం మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులతో, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 220 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ ను తీసుకువచ్చి పనులకు శంకుస్థాపన చేయనున్నామన్నారు, కరకగూడెం మండలానికి కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా అన్ని గ్రామాలకు రహదారులను నిర్మించుకోవడం జరిగింది అన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు నిధులతో జీవోలు మంజూరు అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.మండల పరిధిలోని గ్రామాలలో కోట్లాది రూపాయలు నిధులతో బ్రిడ్జిలను నిర్మించడం జరుగుతుంది అన్నారు. రైతులకు సాగునీరు అందించే విధంగా అనేక ప్రాజెక్టులు నిర్మించుకోవడం జరుగుతుంది అన్నారు. విద్య వైద్య వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నమని ఇప్పటికే రైతులకు సాగునీరు అందించే విధంగానే చెక్ డాంలను నిర్మించుకోవడం జరిగింది అన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు, ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరినీ తమ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాల అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా సీఎం కేసీఆర్ నిలిచారని, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు రైతు బీమా, ఆసరా పెన్షన్లు రైతులకు పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్ అందించి ఆదర్శంగా నిలిచారు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మించి సాగునీరు అందజేసి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ పంట పెట్టుబడి సాయాన్ని అందజేసి రైతులకు అండగా నిలిచిన మహానీయుడు సీఎం కేసీఆర్ అని వారన్నారు, ప్రజలకు కావలసిన సదుపాయాలు ప్రత్యేక దృష్టిసారించి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుంది అన్నారు, రాబోయే రోజులలో ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతామన్నారు.
