ఆకలి తీర్చే బాధ్యత నాది… లక్ష్యం సాధించే బాధ్యత మీది రాష్ట్ర హెల్త్ డైరెక్టర్.. డాక్టర్ గడల శ్రీనివాస్ జి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26… వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఆకలి తీర్చే బాధ్యత తనదని, ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించే బాధ్యత విద్యార్థులదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఉద్యోగ సాధన కోసం జరుగనున్న వివిధ పోటీ పరీక్షలకు సమయాత్తం అవుచున్నా దాదాపు 200 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఆదివారం నుంచి 4 నెలల వరకు ఉచిత మధ్యాహ్న భోజన పధకం , ఉచిత వైఫై సౌకర్యం డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గడల శ్రీనివాస రావు సౌజన్యంతో ప్రారంభించడం జరిగినది . ఈ ప్రారంభ కార్యక్రమంలొ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ . దిండిగాల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలొ .గడల శ్రీనివాస రావు మాట్లాడారు. ఈ ప్రాంతంలో జన్మించి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం కలగడం తన అదృష్టమని , తాను చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాల ద్వారా లబ్ది పొంది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే అది తనకు సంతృప్తి కలిగిస్తుందని . నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగ సాధనలో ముందు వరసలో ఉండాలని మన జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఇంకా ఉద్యోగ సాధనకు అవసరమైతే ఎటువంటి సౌకర్యాలు కావలసిన ఏర్పాటు చేస్తానని భరోసా ఇవ్వడం జరిగినది .. ఈ సందర్బంగా ఇతర వక్తలు మాట్లాడుతూ లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంత మంచి అవకాశం కల్పించిన డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గడల శ్రీనివాస రావు ఔదార్యమును ప్రశంసించి ఆయనకు శాలువ కప్పి పూల మొక్కను బహుకరించడం జరిగినది . యువతీ యువకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ శ్రీనివాసరావు, గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ మోరే భాస్కర్, బీఆర్ఎస్ పాల్వంచ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, జిల్లా కార్యదర్శి కనకవల్లి, వరలక్ష్మీ, నవీన్ మధుబాబు, మునీర్ తదితరులు పాల్గొన్నారు
