మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి, 26: అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆదివారం పలు కార్యక్రమలలో వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం పాల్గొన్నారు. దమ్మపేట మండలం అప్పారావుపేట గ్రామంలో కొయ్యల తిరుపతిరావు పెంటమ్మ దంపతుల కుమార్తె సాయి మహాలక్ష్మి పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి నూతన వస్త్రాలు సమర్పించారు. దమ్మపేట పట్టణంలో కునుసోత్ చెన్నారావు వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె సంధ్య ప్రశాంత్ ల వివాహ వేడుకకు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను సమర్పించారు. అదేవిధంగా అశ్వరావుపేట మండలం కేంద్రంలో వేల్పుల సత్యనారాయణ సంధ్య దంపతుల కుమార్తె శరణ్య నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారికి నూతన వస్త్రాలు బహూకరించారు. వినాయకపురం శ్రీ చిలకల గండి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో పలువురు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
