మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కేంద్రంలో 40 లక్షల వ్యయంతో రాజీవ్ పార్కులో నిర్మించిన ఫుట్బాల్ కోర్టును యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు.ఆదివారం రాజీవ్ పార్కులో నిర్మించిన ఫుట్బాల్ కోర్టులో కాసేపు ఆటవిడుపుగా ఫుట్బాల్ ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని శారీరక మానసికంగా మేధో శక్తిని పెంపొందించేందుకు క్రీడలు ఉపయోగపడతాయి అన్నారు. క్రీడాకారులను తయారు చేసేందుకు ఫుట్ బాల్ కోర్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రీడాకారులకు ఈ ఫుట్ బాల్ కోర్టు ఒక మంచి అవకాశం అవుతుందని చెప్పారు. కోర్టు నిర్వహణ బావుండాలని కొత్తగూడెం మున్సిపల్ అధికారులను అదేశించారు. ఆటవిడుపు గా ఆడిన ఆటలో సింగరేణి డైరెక్టర్ పాల్గొన్నారు.
