మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఫిబ్రవరి 26
విద్యతో పాటు క్రీడల్లో కూడా యువత రాణించాలని భద్రాచలం నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ మానే రామకృష్ణ అన్నారు. మండలంలోని గౌరారం గ్రామంలో గత 20 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు వల్ల స్నేహబంధం తో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి గెలుపోటములు సమానంగా తీసుకోవాలని సూచించారు. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతి లక్ష్మీనగరం జట్టు రూ 20, 000/- బహుమతి దాత ఎండి అలిమ్ ఖాన్, రెండవ బహుమతి లచ్చి గూడెం జట్టు రూ 15, 000/- మూడవ బహుమతిగా మంగువాయిబాడవ జట్టు రూ. 10, 000/- నాలుగో బహుమతిగా బైరగులపాడు జట్టు రూ 5000/- నగదు తో పాటు షీల్డ్ ను ప్రధానం చేశారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన బెస్ట్ బ్యాట్స్మెన్ రాజ్ కుమార్ బెస్ట్ బౌలర్ హేమంత్, విజేతలకు దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ బహుమతులను అందించారు. అనంతరం స్థానిక సర్పంచ్ సోడి జ్యోతి మాట్లాడుతూ ఏజెన్సీలోని క్రీడాకారులు నైపుణ్యానికి కొదవలేదని వారు మరింతగా రాణించి జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి సర్పంచ్ వెంకటేశ్వరరావు,ఇర్పా చంటి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యాలు సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామారావు మండల కార్యదర్శి కనితి రాముడు లక్ష్మణ్ సుధాకర్ సిపిఐ నాయకులు శ్రీనివాసరావు నిర్వాహ కమిటీ సభ్యులు సురేష్ రమేష్ నాగార్జున నిర్వాహ కమిటీ అధ్యక్షులు రేసు శ్రీను వాగే కృష్ణ తదితరులు పాల్గొన్నారు.