మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం, ఫిబ్రవరి 26 .వెంకటాపురం మండలం ఆలబాక గ్రామంలో ఆదివారం జరిగిన సిపిఐ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ రావుపల్లి రాంప్రసాద్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తక్షణమే ఆదివాసీల పో డు భూ సమస్యలు పరిష్కరించాలని మండలంలో ఆదివాసీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదివాసులలో అనేకమంది పోడు పట్టాలు అందలేదని పోడు వ్యవసాయాన్ని మాత్రమే జీవనాధారంగా జీవిస్తున్న ఆదివాసులు వారి హక్కులను కాలరేసే ప్రయత్నం జరుగుతున్నాయని వారు అన్నారు.తిప్పాపురం పంచాయతీ సీతారాంపురం గ్రామంలో చాలా మందికి ఆధార్ కార్డులు లేవని దరఖాస్తుదారులకు అధికారులు సహకరించాలని కోరారు. గిరిజన పల్లెలలో నేటి వరకు సరైన రహదారి సౌకర్యాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సిపిఐ పార్టీ ప్రతి కార్యకర్త ప్రజల సమస్యలను వెలికి తీసి ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరు వెంకటేశ్వరరావు, సిపిఐ మండల కార్యదర్శి పరిషీక బాలకృష్ణ, జిల్లా గిరిజన సమాఖ్య అధ్యక్షులు మీడియం లక్ష్మయ్య,మహిళా సమైక్య జిల్లా నాయకులు మాటూరి సంధ్యారాణి, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ గజ్జల వేణుగోపాల్ రెడ్డి,గోగుల మోడీ హరికృష్ణ అంధురీ సతీష్, మండల జాయింట్ సెక్రెటరీ కాలేశ్వర రావు, సంఖ్య ఆదినారాయణ, శెట్టిపల్లి లక్ష్మీనారాయణ,కట్ల రాజు, కనుక ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
