మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 26 మండల పరిధిలోని బుర్దారం గ్రామంలోని శ్రీ సువర్ణ జ్వాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆద్వర్యంలో వచ్చెనెల 6నుంచి12వ తేదీ వరకు జరగనున్న శ్రీ జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవ కరపత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ నిర్వహకులకు సూచించారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు,బిఅర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
