ఆదివాసీ ల ఆరాధ్య దైవం శ్రీ నాగులమ్మ జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 27 మంగపేట మండలం రాజుపేట (లక్ష్మి నర్సా పురం) గ్రామంలో ప్రతి రెండేళ్లకు ఒక సారి పాల్గుణ శుద్ధ పౌర్ణమిన మార్చి 7 నుంచి 11 వరకు జరిగే శ్రీ నాగులమ్మ మహా జాతర వాల్ పోస్టర్లను (జాతర ప్రచార కరపత్రలు) శ్రీ నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి మేనేజింగ్ ట్రస్ట్ చైర్మన్ బాడిశ రామకృష్ణ స్వామిజీ వడ్డెలు పూజరులు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం విడుదల చేశారు.అనంతరం ఆలయ ప్రధాన పూజారి రామకృష్ణ స్వామిజీ మాట్లాడుతు శ్రీ నాగులమ్మ మహా జాతర మార్చి 7,వ తేజ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజులపాటు, ఐద అంగరంగ వైభవంగా జరుగు తుందని తెలిపారు. మార్చి 7 మండే మెలుగుట, 8 యెర్రట్టల గుట్ట నుండి సడాలమ్మ దేవతను తీసుకొని రావడం, 9 న శ్రీనాగులమ్మ తల్లి గండోర్రె గుట్ట నుండి రాక ,అమ్మ వారి కళ్యాణం అగ్ని గుండాలు ,10 న మొక్కలు చెల్లించుట, 11 న అమ్మ వార్లు తిరిగి వన ప్రవేశం చేయుట జరుగు తుందని జాతరకు వచ్చే భక్తు లకు హన్మకొండ భద్రా చలం హైదరాబాద్ ఖ మ్మం నుంచి బసు సౌక ర్యం కలదని అన్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివాసి సాంస్కృతిక కార్యక్రమాలతో విశిష్టమైన పూజలు ఉంటాయని తెలిపారు . ఈ సమావేశంలో జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు
