రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలి తెలంగాణ రైతు కూలీ సంఘం డిమాండ్.. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు వినతి పత్రం. మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 27, తెలంగాణా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ కు వినతిపత్రం అందించారు. అనంతరం రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ తొ సమస్యలు తలెత్తుతున్నాయని, తక్షణమే ధరణి పోర్టల్ ను సవరణచేయాలని, లేని పక్షంలో ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని అన్నారు. రైతాంగ సమస్యలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుధీప్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు ఏపూరి బ్రహ్మం, కిలారు ప్రసాద్, భూక్యా ద్ధశ్రు, కొమరి హనుమంతరావు, కంపశాటి రామయ్య, చిమట ముత్తయ్య , చల్లగుండ్ల నాగయ్య, నాగేశ్వరరావు, చారి, కృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు.
