UPDATES  

 ర్యాగింగ్ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్.. నిందితులను కఠినంగా శిక్షించాలి గార్లపాటి పవన్..

ర్యాగింగ్ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్.. నిందితులను కఠినంగా శిక్షించాలి గార్లపాటి పవన్.. మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 27, మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రీతి, ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత మృతికి సంఘీభావంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో సోమవారం మండల కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో ర్యాగింగ్ కు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నినదించారు. మండల కేంద్రంలోని చండ్రుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ సెంటర్ నందు మానవహారం ఏర్పాటు చేసి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి పవన్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుతున్న మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రీతి, ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత లు సీనియర్ ల వేదింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థునుల కుటుంబాలకు ప్రభుత్వం తగు న్యాయం చేయాలని కోరారు. కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్సిగేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో విద్యార్థినుల పై జరుగుతున్న దారుణాలు బాధాకరమని, ఇలాంటి సంఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం దోషులను శిక్షించడంలో విఫలమైందన్నారు. తక్షణమే ర్యాగింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బోడ అభిమిత్ర, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !