ప్రీతి మృతికి కారకుడైన సైఫ్ ను కటినంగా శిక్షించాలి. మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి 27:- వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ మెడికో సైఫ్ చేసిన ర్యాగింగ్ వేధింపులకు తట్టుకోలేక ప్రీతి విషపు ఇంజక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో సైఫ్ దుశ్చర్యకు నిరసనగా సోమవారం రోజు ఇల్లందు జగదాంబ సెంటర్ నందు పిడిఎస్ యూ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.కార్యక్రమంలో పిడిఎస్ యూ నాయకులు జె గణేష్ మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ లను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. 5రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం మరణించిందని అన్నారు. . ప్రీతి మృతికి కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్సించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీతి మరణం మరవక ముందే ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న రక్షిత అనే మరో విద్యార్థిని సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ భూతానికి బలై పోయిందని అన్నారు. ఆమె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లను అరికట్టాలని, ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలను పటిష్టంగా నడిపించాలని, సీనియర్, జూనియర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించి స్నేహ పూర్వకంగా మెలిగేటట్లు చేయాలని ర్యాగింగ్ కు బలైన ప్రీతి, రక్షిత కుటుంబాలను ఆదుకోవాలని, ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ మండల కోశాధికారి ప్రభాకర్, పట్టణ కార్యదర్శి కుమార్, సిద్దార్థ, ప్రశాంత్, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు.
