గిరిజన విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి.. తెలంగాణ గిరిజన సంఘం కార్యదర్శి భూక్య శంకర్ నాయక్.. మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 27, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పిజి వైద్య విద్యార్థిని, సీనియర్ మెడికో సైఫ్ అనే నరరూప రాక్షసుడు, ర్యాగింగ్ చేస్తూ రక రకాల వేధింపులతో మానసికంగా వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు కారకుడైన అతనిని, యూనివర్సిటీ ప్రిన్సిపాల్, హెచ్ ఓ డి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, తెలంగాణ గిరిజన సంఘం జూలూరుపాడు మండల కార్యదర్శి భూక్యా శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, 50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ప్రభుత్వాన్ని కోరారు. ప్రీతి కుటుంబ సభ్యులు సీనియర్ల దుశ్చర్యలపై కాలేజీ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పట్టించుకోని ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని అన్నారు. విద్యా సంస్థలో కొనసాగుతున్న ర్యాగింగ్ భూతాన్ని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని అరికట్టాలని, ర్యాగింగ్ పేరుతో విద్యార్థినుల జీవితాలతో చెలగటం ఆడే వారిని విద్య సంస్థల నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు.
