UPDATES  

 మన ఊరు మన బడిలో చేపట్టిన మరమ్మతుల పనులు పూర్తి చేయండి పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం

మన ఊరు మన బడిలో చేపట్టిన మరమ్మతుల పనులు పూర్తి చేయండి పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయండి ఇంజనీరింగ్ అధికారుల సమీక్షలు జిల్లా కలెక్టర్ అనుదీప్ మన్యంన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27….. వచ్చే నెలాఖరు వరకు మన ఊరు – మనబడిలో చేపట్టిన మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని పనులు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో మనఊరు – మనబడి పనుల పురోగతిపై కొత్తగూడెం, వైరా నియోజకవర్గ పరిధిలోని జూలూరుపాడు మండల విద్యా,ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎంసి తీర్మానం ద్వారా చేపట్టిన అన్ని 324 పాఠశాలలను అన్ని హంగులతో పూర్తి చేయాలన్నారు.. పనులు వేగవంతంచేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు, యంఈఓలు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన కార్యక్రమమని ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు.. ఎందరో విద్యార్థుల ఉజ్వలభవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాలు పాఠశాలలని, ప్రాధాన్యతను గుర్తించి సత్వరం పూర్తి చేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రారంభించని పనులు సత్వరంప్రారంభించు విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పనులు దక్కించుకుని నత్తనడకన జరుగుతుంటే కాంట్రాక్టర్లుకు నోటీసులు జారీ చేయాలని చెప్పారు. చేసే స్థోమత లేనపుడు ఎందుకు పనులు దక్కించుకున్నారో కారణాలను తెలుసుకోవాలని చెప్పారు. అనుభవం లేని కాంట్రాక్టర్లును తొలగించి ఇతరులకు పనులు అప్పగించాలని చెప్పారు.జరుగుతున్న పనులకు ప్రత్యామ్నాయంగా పనులు చేపట్టాలని చెప్పారు. రానున్న 30రోజుల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నందున అధికసంఖ్యలో కూలీలను ఏర్పాటు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటానని, అటువంటి అవకాశం తనకు ఇవ్వొద్దని చెప్పారు. ఈ నియోజకవర్గాల్లోని ఆరు మండలాల్లో మేజర్ అండ్ మైనర్ పనులు 83 చేపట్టగా 37 పనులు పూర్తయ్యాయని, 29 పనులు పురోగతిలో ఉన్నాయని,17 పనులు ప్రారంభించాల్సి ఉన్నట్లు చెప్పారు. అలాగే 20 పాఠశాలలకు మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందని, 26 పనులు ప్రగతిలో ఉన్నాయని, 36 చోట్ల ప్రారంభించాల్సి ఉన్నట్లు చెప్పారు. విద్యుత్ ఏర్పాట్లు గురించి ప్రస్తావిస్తూ 69 పాఠశాలల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని, 12 ప్రగతిలో ఉన్నాయని, రెండు చోట్ల ప్రారంభించాల్సి ఉన్నట్లు తెలిపారు. 2 పాఠశాలల్లో బోజన శాలలు పూర్తయ్యాయని, 8 చోట్ల ప్రగతిలో ఉన్నాయని, 63 చోట్లు అవసరం లేదని, మిగిలిన 10 చోట్ల ప్రారంభించాల్సి ఉన్నట్లు చెప్పారు. నూతన తరగతి గదులు 2 చోట్ల పూర్తయ్యాయని, 6 చోట్ల ప్రగతిలో ఉన్నాయని, 70 చోట్ల అవసరం లేదని, 5 ప్రారంభించాల్సి ఉన్నట్లు చెప్పారు. అలాగే ప్రహరిగోడలు గురించి ప్రస్తావిస్తూ 25 చోట్ల నిర్మాణం పూర్తయిందని, 13 పనులు ప్రగతిలో ఉన్నాయని, 15 చోట్ల అవసరం లేదని, 30పనులు ప్రారంభించాల్సి ఉన్నట్లు చెప్పారు. 2 చోట్ల వంట గదులు పూర్తయ్యాయని, 10 చోట్ల ప్రగతిలో ఉన్నాయని, 47 చోట్ల అవసరం లేదరి, 24 పనులు ప్రారంభించాల్సి ఉన్నట్లు చెప్పారు. 6 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి అయ్యిందని, 27 పనులు ప్రగతిలో ఉన్నాయని, 12 చోట్ల అవసరం లేదని, 38 పనులు ప్రారంభించాల్సి ఉన్నట్లుఆయన పేర్కొన్నారు. సివిల్ పనులు పూర్తయిన అన్ని పాఠశాలల్లో సెంట్రల్ ప్రోక్యూర్మెంట్కు ఇండెంట్ పెట్టాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో పచ్చదనాన్ని పెంచేందుకు లాన్లు ఏర్పాటు చేసి ఆహ్లాదంగా తయారు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ, పిఆర్ ఈఈ సుధాకర్, ఐడిసి ఈ ఈ నాగశేషు, అన్ని మండలాల యంఈఓలు, ప్రధానోపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !