త్వరలో పోడు పట్టాలను అందజేస్తాం లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు చేస్తున్నాం విలేకరుల సమావేశంలో కొత్తగూడెం శాసనసభ్యులు వనమా మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు సాగు దారుల విషయంలో ఒక స్పష్టత వచ్చారని పోడు రైతులకు కూడా భరోసా కల్పిస్తూ త్వరలో పొడుపట్టాలు అందజేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్రంతో పాటు జిల్లాల వారీగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పోడు దారులకు త్వరలోనే పట్టాలు అందజేస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. పోడు పట్టాలు ఇచ్చేందుకు నూరు శాతం లో దాదాపుగా 90% వరకు ప్రక్రియ పూర్తయిందని పోడు సాగు చేస్తున్న గిరిజనులు అతికొద్ది రోజుల్లోనే మంచి శుభవార్త వింటారని పోడు పట్టాలను ప్రభుత్వం చేతికి అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీటితో పాటు నిరుపేద వర్గాలకు నిలువ నీడ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు లాటరీ పద్ధతి ద్వారా ప్రక్రియను మొదలు పెడుతున్నామని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెంగా సుమారు 40 వేలకు పైగా పొడుపట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. వీటితోపాటు ఇంటి స్థలం ఉన్నటువంటి పేద నిరుపేద వర్గాలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని సాహసాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో బలోపేతంగా నిర్ణయాలను తీసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు సముచితమైన న్యాయాన్ని కల్పిస్తున్నారని అన్నారు. గత కొన్ని ఏళ్ల కాలం నుంచి పోడు పట్టాల కోసం ఎదురుచూస్తున్న గిరిజనుల ఆశలు నెరవేరబోతున్నాయి అనడంలో సందేహం లేదన్నారు. సుదీర్ఘకాలం పాటు పోలీస్ రెవెన్యూ ఫారెస్ట్ శాఖలో సంయుక్త ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములను సర్వే చేపట్టి ఎవరైతే పోడు సాగు చేసుకుంటున్నారో ఆ కుటుంబాలను గుర్తించి వారికి పొడుపట్టాలను అందించడం తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీత లక్ష్మి జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ ఎంపీపీలు విజయలక్ష్మి ,భూక్య సోనా, మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్యా రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, ఉర్దూగర్ చైర్మన్ అన్వర్ పాషా, నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, కోలాపూరి ధర్మరాజు, ఎంపీటీసీ కొల్లు పద్మ, కూచిపూడి జగన్ తదితరులు పాల్గొన్నారు.
