UPDATES  

 నేడు కొత్తగూడెం క్లబ్లో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి… జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో మంగళవారం జరుగుతున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ యువతకు పిలుపునిచ్చారు. సోమవారం.ఐడిఓసి కార్యాలయంలో ఉపాధి శిక్షణశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించే జాబ్ మేళా కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.కొత్తగూడెం క్లబ్ లో ఉదయం 9 గంటల నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు ఈ జాబ్ మేళాకు 8, 10 వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పి.జి, సి.ఎ. ఇంజనీరింగ్, యం.బి.ఏ., యం.సి.ఏ., ఐ.టి.ఐ. (ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, సివిల్, కార్పెంటర్, ప్లంబింగ్ చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. పైన పేర్కోన్న విధంగా విద్యార్హతలు కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా ఫారంతో పాటు విద్యార్హతల జిరాక్స్ పత్రాలను వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. మొత్తం 3 వేల ఖాళీలను భర్తీ చేయుటకు నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 2 వేల ఉద్యోగాలు జిల్లా స్థాయిలో కల్పించడం జరుగుతుందని, వేయి పోస్టులు సాఫ్ట్ కంపెనీలలో కల్పించనున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున యువత హాజరయ్యేందుకు జిల్లా అధికారులు వారి సిబ్బంది వారికున్న అన్ని వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేయాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధి కల్పన అధికారి వేల్పుల విజేత, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !