UPDATES  

 ఎస్టీ జాబితా లో బిసి కులాలను చేర్చొద్దు. తుడుం దెబ్బ

 

మన్యం న్యూస్ ఏటూరు నాగారం, ఫిబ్రవరి 27

తెలంగాణ ప్రభుత్వం బిసి కులాలను ఎస్టీ జాబితా లో కలుపుతూ అసెంబ్లీ లో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ తుడుం దెబ్బ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఐటిడిఏ ఏటూరు నాగారం పీవో కు వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు కబ్బాక శ్రావణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ.కులాల ను కలుపుతూ అసెంబ్లీ లో ప్రభుత్వం తీర్మానం చేయడం ఆదివాసీ ల హక్కులను కాలరాయడమే అవుతుంది అని,కులాలను కలపాలన్న తీసివేయాలి అన్న దానికో ప్రక్రియ ఉంటుంది అని అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా కులాలను కలుపుతామంటే సహించేది లేదని అన్నారు.
చెళ్ళప్ప కమీషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆదివాసిలంత ఏక పక్షంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించామని,మెజార్టీ ప్రజల అభిప్రాయానికి విరుద్ధం గా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సరియైనది కాదు అన్నారు. ట్రైబల్ అడ్వైజరి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి గిరిజన యం ఎల్ ఏ లు అందరూ దానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరారు.ఇట్టి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని అన్నారు.సాగులో ఉన్న ఆదివాసీలు అందరికి హక్కు పత్రాలు ఇవ్వాలని,ఛత్తీస్ గడ్ నుండి వలస వచ్చిన ఆదివాసులకు కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.టైగర్ జోన్ పేరుతో ఆదివాసి ప్రాంతాల వనరులను దోచుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని అందులో భాగంగానే గ్రామాల తరలింపు ప్రక్రియ అన్నారు. ఈ ప్రతిపాదన ను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. ఏజన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాయం జానకి రమణ, పోడెం బాబు,జిల్లా అధ్యక్షుడు చింత కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎట్టి రాజబాబు,కార్యదర్శి మడకం చిట్టిబాబు, కాపుల సమ్మయ్య, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్ద బోయిన సర్వేష్,మండల అధ్యక్షుడు కబ్బాక రామన్న,సొలం సురేష్,వంక నరేష్, తదితరులు పాల్గోన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !