మన్యం న్యూస్. ములకలపల్లి. ఫిబ్రవరి 27.మండలం లోని పూసుగూడెం సెక్టార్ పరిధిలోని కొమ్ముగూడెం రైతు వేదిక లొ అంగన్వాడి సూపర్ వైజర్ ఎమ్ జ్ఞాన సుందరి ఆధ్వర్యంలో పూసుగూడెం సెక్టర్ పరిధిలోని ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రం లోని గర్భిణీ లకు సామూహిక శ్రీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిడిపివో జ్యోతి, స్థానిక సర్పంచ్ బి విజయ, అంగన్వాడి ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
