మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఫిబ్రవరి, 27 మా గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించిండని అశ్వరావుపేట మండలం వాగొడ్డుగూడెం కాలనీవాసులు కోరుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రజావాణి లో సోమవారం విజ్ఞప్తి పత్రం అందజేశారు. తమ గ్రామం ఏళ్ల తరబడి చీకట్లోనే మగ్గుతుందని, వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు. 23 ఏళ్లుగా నివసిస్తున్న కనీసం మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదని వాపోయారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను వాగొడ్డుగూడెం కాలనీ గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించడం జరిగిందని ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.