మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి, 27: మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ సాదు జోత్స్నా భాయ్ సోమవారం గ్రామపంచాయతీలో పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని వాగొడ్డు గూడెం గ్రామంలో అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలను విజిటింగ్ చేసే స్కూల్ పిల్లలతో, వంట చేసే వారితో మాట్లాడి పాఠశాలలో ఉన్న సమస్యను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో వీధి దీపాలు వేయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్, పాఠశాల సిబ్బంది, అంగన్వాడి ఆయా, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
