గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇస్తా..
తిప్పనపల్లి పంచాయతీకి రూ.10లక్షలు నిధులు..
అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు..
మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి27 : అశ్వరావుపేట నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ముఖ్యమంత్రితో మాట్లాడి తీసుకొస్తానని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం తిప్పనపల్లి పంచాయతీలో ఎన్ఆర్ఆఈజిఎస్ నిధులతో నిర్మిస్తున్న రూ. 15లక్షల విలువ చేసే సిసిరోడ్ల నిర్మణానికి ఎమ్మేల్యే భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వరాష్ట్రంలో తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కిందని, తిప్పనపల్లి పంచాయతీకి మరో రూ.10లక్షలు అధనంగా కేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రామాల్లో నూతనంగా మంజూరైనా సీసీరోడ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనుల పురోగతిని సమీక్షించాలన్నారు. గ్రామాల్లోసమస్యలుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, పంచాయతీ సర్పంచ్ దరావత్ పార్వతి, ఎంపిటీసీ లంకా విజయలక్ష్మి, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, గుంపిన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్రావు, పంచాయతీ ఉపసర్పంచ్ ధరావత్ రామారావు, వార్డు మెంబర్ పసుపులేటి మంగయ్య, బిఆర్ఎస్ నాయకులు గాదె శివప్రసాద్, కొత్తూరి వెంకటేశ్వరరావు, భూపతి శ్రీనివాసరావు. గుగులోత్ రాములు, తదితరులు పాల్గొన్నారు.