మన్యం న్యూస్. దమ్మపేట. ఫిబ్రవరీ 27.ఆడపిల్లలు ఎంతటి అత్యున్నత స్థాయికి వెళ్లినా ఆమె విద్యను అభ్యసిస్తున్న విద్యాలయాలలో ఆడపిల్లలకు ఇంకా భద్రత లేదని,ధారావత్ ప్రీతి అనే మెడికల్ పీజీ విద్యార్థిని ఆత్మహత్యను గమనిస్తే ఇంతటి టెక్నాలజీ,ఇంతటి అభివృద్ధి చెందిన ఆడపిల్లలకు రక్షణ లేని ఈ సొసైటీలో ఎన్ని విద్యాసంస్థలు తెచ్చిన, ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చిన, కొందరు దుర్మార్గు లు చేసే ఆటవిక చేష్టలు మన అభివృద్ధిని ఎక్కిరిస్తూ అంధ:పాతాళానికి చేరుస్తున్నాయని వైయస్సార్ టిపి జిల్లా అధ్యక్షులు సోయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆమె అకాల మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న మన్నారు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టు,దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తాము అన్నట్టు ప్రకటించి నంత మాత్రాన ఇది మాత్రమే సరిపోదని,భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు శాశ్వత రక్షణ పరిష్కారం కలిగేలా చేయాలని అన్నారు.ర్యాగింగ్ వేధింపులేనా మరి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయో ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాలని,ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, సమాజానికి ఉన్నదితెలిపారు.ఇప్పుడు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించ గలదు,దోషుల్ని శిక్షించగలదు,సమాజం సానుభూతి ప్రకటించగలదు,కానీ పోయిన ఆ ప్రాణమే ఉంటే ఈ సమాజంలో ఎంత మంది రోగుల ప్రాణాలు కాపాడ గలిగేదో, ఆమె కుటుంబానికి ఎంత ఆర్థిక భరోసా, హోదా ఇవ్వగలిగేదో
సమాజానికి, తన కుటుంబానికి జరిగిన ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేయగలరని,మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతికి అశ్రునివాళి అర్పిస్తూన్నానని తెలిపారు.
