UPDATES  

 డాక్టర్ ప్రీతి కి ఒక హృదయం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి

 

మన్యం న్యూస్, సారపాక , ఫిబ్రవరి 28
బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక లోని ఒక హృదయం సోషల్ వెల్ఫేర్ ఆశ్రమంలో మంగళవారం ర్యాగింగ్ భూతానికి బలి అయిన ప్రీతి నాయక్ కి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఒక హృదయం సోషల్ వెల్ఫేర్ అధ్యక్షులు సంజీవరెడ్డి ఐ టి సి టిఆర్ఎస్కెవి అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈ ఘటన చాలా బాధాకరమైనది ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని మనవి చేశారు ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని ఎవరైనా ఇటువంటి దాడులు చేస్తే తల్లిదండ్రులను, పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. అంతేగాని మానసిక వేదనతో క్షమికావేశంతో బలవన్మరణం వంటి వాటికి పాల్పడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సాలయ్య, పి రవళి, రమేష్ ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !