మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి 28: ఇల్లందు జగదాంబ సెంటర్లో గల రామాలయం నందు భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి నవమినాటి కళ్యాణంలో వినియోగించే తలంబ్రాలు, గోటితో వలిచే తలంబ్రాలు తయారుచేసే కార్యక్రమం మంగళవారం రోజు సాయంత్రం జరిగింది.గోటి తలంబ్రాలు తయారితో పాటు ఆలయ అర్చకులు సంతోష్ శర్మ అధ్వర్యంలో భక్తులకు కోలాటం లాంటి సాంసృతిక కార్యక్రమాలు జరిగాయి.