మన్యం న్యూస్,వాజేడు: ఫిబ్రవరి 28
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మండలంలో వాజేడు జంగాలపల్లి మినీ గురుకులంలో సైన్స్ డే”వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహిం చారు. ప్రపంచం సైన్స్ పై ఆధారపడి ఉంది, విద్యార్థులు సైన్స్ పై ప్రతిభను కనపర్చాలని, మనిషి పుట్టుక నుండి మరణించే వరకూ అన్నీ సైన్స్ ఆధారిత మానవులు గానే జీవనాన్ని సాగిస్తున్నారు మినిగురులం పాఠశాలలో సైన్స్, మాథ్స్ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన వర్కింగ్ మోడల్ ప్రాజెక్ట్‌లను అందరినీ ఆకర్షించాయి. మినీ గురుకులం హెచ్ ఎం. అరేం కవిత మాట్లాడుతూ..సర్ సివి రామన్ రామన్‌ఎఫెక్ట్‌ను కనుగొన్న సందర్భంగా నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నట్లు తెలిపారు. తమ గురుకులంలో చదివే విద్యార్థులు అంతటి ప్రతిభ విజ్ఞానంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
