మన్యం న్యూస్ కరకగూడెం: చదువుకోవాలని ఒకవైపు ఆరాటం మరోవైపు ఆర్థిక ఇబ్బందులు కలిసి చదువుకు దూరమయ్యే పరిస్థితి ఆర్థికదాతల కోసం ఎదురుచూపు . వివరాల్లోకెళ్తే కరకగూడెం మండలం పరిధిలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతీకి చెందిన ఊకే ప్రవళిక. తండ్రి కేశవరావు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రవళిక నవోదయ సెంట్రల్ స్కూల్ పదవ తరగతి పాసై నవోదయ సెంట్రల్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. డాక్టర్ రాజేంద్రప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీహార్ (పట్న)లో బీఎస్సీ అగ్రికల్చర్ సీటు సంపాదించినప్పటికీ ఆర్థిక పరిస్థితులు వెంటాడు ఉండటంతో కాలేజీకి పోలెని పరిస్థితి. తల్లిదండ్రులను డబ్బులు అడగ లేక, చదవలేక సతమతమవుతూ దాతల కోసం ఎదురుచూస్తుంది. దాతలు ఎవరైనా సాయం చేసేవారు.ఈ నెంబర్ కి గుగుల్ పె, పోన్ పె చెయ్యగలరు. . 6303249277 అందించగలరని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
