ప్రజా సమస్యలపై ఫోన్ మాట్లాడడం తప్పా
ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి
ప్రజా ప్రతినిదులు అన్నాక సమస్యలపై స్పందించాల్సిన కనీస భాద్యత ఉంటుంది
వాస్తవాలు తెలుసుకోకుండా ఇస్తానుసారంగా వ్రాయడం ఎంతవరకు సబబు*
వాస్తవాలకు నేను సిద్ధం..- మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి*
మన్యం న్యూస్, మణుగూరు , ఫిబ్రవరి28:
మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సమస్యలపై ప్రజలు ఫోన్ చేస్తే మాట్లాడడం తప్పా అని మణుగూరు ఎంపీపీ కారం విజయకుమార్ అన్నారు. ఆమె మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మణుగూరులో జరిగిన సమావేశంలో ఓ పత్రికకు చెందిన విలేకరి టార్గెట్ చేసి వార్తలు రాయడం ఎంత వరకు సమంజశమన్నారు. సమావేశంలో ఫోన్లు వస్తే మాట్లాడకూడదా.. ఎవరో ఎన్నో ప్రజా సమస్యల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు. ఫోన్ ఎత్తకపోతే ఒక తప్పు ఫోన్ ఎత్తితే ఒక తప్పా.. అని ఎంపిపి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాల్లో ఫోన్ మాట్లాడకూడదని ఎక్కడ ఎలాంటి రూల్ లేదని, పెద్ద పెద్ద సమావేశాల్లోనే ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు ఫోన్ లో మాట్లాడుతున్నారు కదా అన్నారు. గతంలో కూడా ఇదే విలేఖరి తనని టార్గెట్ చేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు అని అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే వైఖరిని కొనసాగిస్తున్నాడని వాపోయారు. ఇతని వల్ల ప్రజా ప్రతినిధులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇతను పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని, వాస్తవ సమస్యలపై అవగాహన లేకుండా తమ మనోభావాలను దెబ్బ తీసేలా ఒక గిరిజన ఆదివాసీ ఎస్ టి కోయ మహిళ అయినటువంటి ఒక అడపడుచుని ఏదో ఒక రకంగా కొంతమంది స్వలాభం కోసం స్వార్థం కోసం వారి గుప్పెట్లో ఉంచుకోవాలని కొందరు పాత్రికేయులు కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా టార్గెట్ చేస్తూ.. మా యొక్క మనోభావాలను, రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ఇలా మమ్ములను మా పేరు ప్రతిష్టలను భంగం కలిగేలా మానసికంగా వేధించడం ఎంతరవకు సబబు అని తను ఆవేదన చెందుతున్నారు. గిరిజన మహిళలమైన మాపై ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అన్నారు. పెన్ను చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేదే లేదన్నారు. ఇతని వ్యవహార శైలిపై చట్టపరంగా ఎంత దూరమైనా తను సిద్ధంగా ఉన్నామని, ఇలా ఇంతమందిని కలం మాటున వేధింపులకు గురి చేస్తారని తనదైన శైలిలో ఘాటుగానే స్పందించి, ఇంతటితో వదలకుండా.. లీగల్ గా కేసు వేసి చట్టపరంగా నాపై మోపిన ఆరోపణను నిరూపించాలని సవాల్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
