మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఫిబ్రవరి 28
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణంలో భూమి కోల్పోతున్న బాధితులకు న్యాయం జరగకుండా వేరే వ్యక్తులకి ఎటువంటి సంబంధం లేని వారికి నష్ట పరిహారం చెల్లించారని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణంలో భూమి కోల్పోయిన బాధిత రైతులు స్థానిక సర్పంచ్ తెల్లం వరలక్ష్మి, ఆదివాసీ నాయకులు మల్లుదొర సమక్షంలో మంగళవారం తహసిల్దార్ చంద్రశేఖర్ ను నిలదీశారు. మండలంలోని సీతానగరం గ్రామంలోని 50/1 ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని గత సంవత్సరం సీతమ్మ ప్రాజెక్టు భూసేకరణ అధికారులు భూమిని తీసుకున్నారని సాగు చేసుకుంటున్నా వ్యక్తికి నష్టపరిహారం చెల్లించకుండా అదే గ్రామానికి చెందిన వాగే వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి ఈ భూమి మీద నష్టపరిహారం చెల్లించారని అధికారులు ఎటువంటి విచారణ చేయకుండా పక్షపాతంతో కొందరి అండదండలతో ఎటువంటి విచారణ జరుపుకుంటా అధికారులు ఏకపక్షంగా ఆ వ్యక్తికి భూమికి సంబంధించిన నష్ట పరిహారం చెల్లించారని ఆరోపించారు. ఈ నష్ట పరిహారం చెల్లింపు వ్యవహారంలో అధికారులు పనితీరుపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తామని అన్నారు. గత కొన్ని రోజులుగా నష్ట పరిహారం చెల్లించాలని ఎల్ అండ్ టి అధికారులు, మండల రెవెన్యూ అధికారులు ముందు ఎన్ని వినతి పత్రాలు అందించిన పట్టించుకోవడంలేదని నష్టపరిహారం చెల్లించకపోతే ప్రాజెక్టు పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. చట్టపకారం బాధితులకు ఇప్పుడు అందించిన నష్టపరిహారం ఎందుకు చెల్లించలేదని ప్రాజెక్టు కంపెనీ అధికారులు తహాసిల్దారిని అడగ్గా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు .ఇట్టి విషయమై నష్టపరిహారం పొందిన వాగే వెంకటేశ్వరరావు రెవిన్యూ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ నష్టపరిహారం కాజేసిన సదరు వ్యక్తిపై చట్టబకారం చర్యలు తీసుకుని బాధ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.