తెలంగాణ యాదిలో నిన్ను మరువను బిడ్డ
దామరతోగు గ్రామ ప్రజల భావోగ్వేదం
రాష్ట్రంలోని అతి చిన్న పంచాయతీకి రూ.8కోట్లుతో బ్రిడ్జి
మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 28 ఎన్నో ఏళ్ల నాటి కల నెరవేర్చినారు. తెలంగాణ యాదిలో నిన్ను మరవనుబిడ్డ రేగా అంటూ దామరతోగు గ్రామ ప్రజలు భావోద్వేగారికి గురయ్యారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం మండలంలో పర్యటించారు. ముందుగా దామరతోగు గ్రామానికి చేరుకొని ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దామరతోగు ఎస్సీ కాలనీకి వెళ్లాలంటే నరకపాయమే అలాంటి గ్రామానికి 81 లక్షలతో వద్దనతోపాటు రహదారిని మంజూరు చేయడంతో ఒక్కసారిగా గ్రామ ప్రజలు రేగా కాంతారావుకు కృతజ్ఞతతో పాటు భావోద్వేగానికి గురయ్యారు . అంతేకాక అదే కాలనీకి మరో రోడ్డును కోటి రూపాయలతో మంజూరు చేయడంతో ఎస్సీ కాలనీ వాసుల కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. మండలంలో మొత్తం సీసీ రోడ్ల కోసం 65లక్షల రూపాయలను మంజూరు చేయించారు దామరతోగు గ్రామంలో 20 లక్షలు, సాయనపల్లి గ్రామంలో 20 లక్షలు, జగ్గయ్య గూడెం గ్రామంలో 25 లక్షల సిసి రోడ్లను శంకుస్థాపన చేశారు. గతంలో మంజూరు చేసిన సాయనపల్లి గ్రామంలో1, ముత్తాపురం గ్రామాల్లోని2 సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. మొత్తం అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున శంకుస్థాపనలు చేసిన రేగా ఏండ్ల నాటి రహదారులను సైతం కోట్ల రూపాయలతో వాటి రూపురేఖలను మార్చే విధంగా నిధులను మంజూరు చేయించారు. గుండాల, చిన్న వెంకటాపురం మార్గంలో రేగా కాంతారావు 1కోటి 30 లక్షలనిధులు మంజూరు చేసి పూర్తి చేయించిన వంతెనను సైతం పరిశీలించారు. అభివృద్ధి అంటే ఆమడ దూరంలో ఉండే గుండాల మండలానికి కోట్ల రూపాయల నిధుల సునామీని తీసుకువచ్చి ప్రతి పల్లెకు రహదారిని పూర్తి చేయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 34 ఓట్లతో అతి చిన్న పంచాయతీగా గుర్తింపు తెచ్చుకున్న దొంగతోగుకు కిన్నెరసాని వాగుపై ఎనిమిది కోట్ల 30 లక్షల రూపాయలతో బ్రిడ్జిని మంజూరు చేసి మంగళవారం శంకుస్థాపన చేశారు. రహదారులు నోచుకోని పల్లెలకు సైతం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి హై లెవెల్ వంతెన తోపాటు బీటీ రోడ్లను సైతం పూర్తి అయ్యే విధంగా రేగా కాంతారావు చొరవ చూపుతున్నారు. మండలంలోని ప్రతి పల్లెకు రోడ్ల కోసం నిధులను మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. చిన్న వెంకటాపురం నుండి మల్లెల గుంపు వెళ్లేందుకు కిన్నెరసాని నదిపై మూడు కోట్ల 40 లక్షల రూపాయలతో వంతెనలతోపాటు రహదారిని కూడా మంజూరు చేశానని త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు మల్లెల గుంపు గ్రామస్తులకు రేగా కాంతారావు భరోసానిచ్చారు. అంతర్గత రహదారులు వర్షాకాలం వచ్చిందంటే బురద కూపాలుగా మారుతున్నాయని ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ప్రతి పల్లెకు సిసి రోడ్లను మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 70 కోట్ల రూపాయలతో గుండాల మండలాన్ని ప్రగతి పదములు నిలుపుతున్నారని గతంలో ఏ నాయకుడైన ఇంత ఎత్తున నిధులు మంజూరు చేశాడా అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలవేళకువచ్చి కొందరు బూటకపు మాటలు నెరవేరని హామీలు ఇస్తారని అలాంటి మాటలు వినడం వలన ఎలాంటి ఉపయోగం లేదని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చేసే నాయకులకు అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ పర్యటనలో తాసిల్దార్ నాగ దివ్య, ఎంపీడీవో సత్యనారాయణ, గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, నియోజకవర్గ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్, వట్టం రాంబాబు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, అధికార ప్రతినిధి టి రాము,యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్ , ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్టా రాములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
