మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 28
మణుగూరు మండలం గుట్ట మల్లారం యందు శ్రీ చైతన్య పాఠశాలలో మంగళవారం సైన్స్ డే సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులను తయారుచేసి ప్రదర్శించటం జరిగింది.ఈ కార్యక్రమానికి మణుగూరు మండలం ఎంఈఓ వీరస్వామి , గైనకాలజిస్ట్ సంఘమిత్ర శివకుమార్ పిహెచ్సి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలు రకాల సైన్స్ ప్రదర్శనలు చూసి విద్యార్థుల ప్రతిభ ను మెచ్చుకున్నారు.విద్యార్థిని విద్యార్థులు ఇటువంటి ప్రదర్శన లతో ఆగకుండా నిరంతరం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ నూతన ఆవిష్కరణలు చేయాలనీ, శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలని తద్వారా మీ తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, దేశం యావత్తు మీ ప్రతిభ కు నీరజనాలు అందించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ కోఆర్డినేటర్ ఎం వి కృష్ణారావు మాట్లాడుతు విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులను ప్రదర్శించారని ఒక్కొక్క ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఉందని పిల్లల యొక్క ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందని వారి యొక్క మేధాశక్తిని కొనియాడారు. ఒక ప్రాజెక్ట్ మించి మరొక ప్రాజెక్టు ఉందని పిల్లలు ఇంత అద్భుతంగా చేస్తారని ఊహించలేదని ప్రశంసించారు. దీనికి సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సాయి కృష్ణ ప్రసాద్, ఎం నరేష్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
